“రాధే శ్యామ్” అక్కడ నుంచి కూడా తప్పుకుందా..?

Published on Jul 9, 2021 5:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల బ్యాలన్స్ షూట్ ని స్టార్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అందులో పూజా కూడా తన టాకీ ని కంప్లీట్ చేసుకుంది.

సరే ఇవన్నీ బాగానే ఉన్నా ఈ సినిమాకి ఎప్పుడు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది అన్నది ఎప్పటికప్పుడు ప్రశ్నర్ధకంగా మారుతూ వస్తుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా వచ్చే దసరా రేస్ లో నిలుస్తుంది అని కొన్నాళ్ల కితం బాలీవుడ్ వర్గాలు నుంచి టాక్ వచ్చింది.

కానీ ఇపుడు టాలీవుడ్ నుంచి మెగా సినిమాలు అన్నీ పలు విడుదల తేదీలను కన్ఫర్మ్ చేసుకుంటుండగా రాధే శ్యామ్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేనట్టు తెలుస్తుంది. అలా దసరా రేస్ లో ఈ సినిమా నిలుస్తుంది అన్నది అనుమానమే అని మరో టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఈ భారీ చిత్రం విడుదల తేదీ ఎప్పటికి కన్ఫర్మ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :