“రాధే శ్యామ్” రిలీజ్ డేట్ ప్రకటించేది అప్పుడేనా.?

Published on Jan 27, 2021 5:44 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “రాధే శ్యామ్” కూడా ఒకటి. భారీ బడ్జెట్ అండ్ విజువల్స్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాకు సంబంధించి గత కొంత కాలంలో రచ్చ నడుస్తూనే ఉంది. అన్నిటికన్నా ముందు అయితే ఈ సినిమా టీజర్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ సహా పాన్ ఇండియన్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇది వచ్చాకే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అన్నది కూడా ఆశిస్తారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం అతి త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ తోనే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది కూడా రివీల్ చేస్తారు అన్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు ఏప్రిల్ చివరలో విడుదల ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు అది మే కు వెళ్లినట్టుగా తెలుస్తుంది. మరి ఆ డేట్ ఎప్పుడో అన్నది తెలియాలి అంటే టీజర్ కోసం ఎదురు చూడాల్సిందే. లేదా వేరేగా ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :