మరింత వెనక్కి వెళ్లిన “రాధే శ్యామ్” షూట్!

Published on Apr 21, 2021 9:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ వండర్ ను దర్శకుడు రాధా కృష్ణ తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే మొదట షూట్ అంతా కంప్లీట్ అయ్యినప్పటికీ కొన్ని సీన్స్ ను బెటర్ చెయ్యడానికి మళ్ళీ షూట్ ను కొన్ని రోజుల కితమే స్టార్ట్ చేశారు.

కానీ అనుకోకుండా మళ్ళీ కరోనా ఉదృతి పెరగడంతో ఆ షూట్ ను కాస్త నిలిపివేశారు. అయితే జస్ట్ రెండు వారాల్లోపు ఆ షూట్ అంతటినీ కంప్లీట్ చేసేయాలని చూసిన టీం ఇప్పుడు కొన్ని వారాల మాటు షూట్ ను నిలిపివేసినట్టు తెలుస్తుంది. అలాగే ఎప్పుడు మొదలు అవుతుంది అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. కరోనా ఉదృతి తగ్గితే కానీ అంత తొందరగా షూట్ మొదలయ్యే సూచనలు లేవు. మరి ఈ కాస్త బ్యాలన్స్ ఉన్న షూట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :