కాస్త ముందు గానే “రాధే శ్యామ్” టీం రివీల్ చేసారుగా!

Published on Oct 21, 2020 9:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా “రాధే శ్యామ్” అప్డేట్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇటీవలే స్వయంగా ప్రభాస్ నుంచే రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ తన పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ చిత్రంకు సంబంధించి ఒక సిసలైన కీ ఎలిమెంట్ ను మాత్రం ఇప్పటి వరకు రివీల్ చెయ్యలేదు. అదే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ విషయంలో.

ఈ ఒక్క ఎలిమెంట్ ను దర్శక నిర్మాతలు ఎందుకో ఇప్పటి వరకు గోప్యం గానే ఉంచారు. అయితే ఈ నెలలో ప్రభాస్ పుట్టినరోజు ఉండడంతో బహుశా దానిని ఆ రోజే రివీల్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. పైగా మోషన్ పోస్టర్ టీజర్ వస్తుంది అని టీజ్ చేస్తూ వదిలిన అనౌన్స్మెంట్ పోస్టర్ లో “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” అని ఉండేసరికి చాలా మందికి అప్పుడప్పుడే అంతా క్లియర్ అయ్యినట్టు అనిపించింది.

దీనితో ఈ అంశాన్ని కూడా ప్రభాస్ పుట్టిన రోజునే అనౌన్స్ చేస్తారని అనుకుంటే కాస్త ముందుగానే ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నాడని రివీల్ చేసేసారు. ఈ ఒక్క అంశం మాత్రం రాధే శ్యామ్ విషయంలో ఎప్పటి నుంచో మంచి మోస్ట్ అవైటెడ్ గా కొనసాగుతూ వచ్చింది. మొత్తానికి మాత్రం కాస్త ముందు గానే దీన్ని రివీల్ చేసారు. ఇప్పుడు రానున్న సరికొత్త సర్ప్రైజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More