ప్రభాస్ రోల్ రివీల్ చేసి సర్ప్రైజ్ చేసిన “రాధే శ్యామ్” టీం.!

Published on Oct 21, 2020 11:49 am IST

మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగి ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా మారిన హీరో ప్రభాస్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హ్యాండ్సమ్ హంక్ నుంచి ఇపుడు మూడు భారీ చిత్రాలు రానున్నాయి. అయితే వీటిలో ఇప్పుడు ఆల్ మోస్ట్ షూట్ ను పూర్తి చేసుకున్న చిత్రం “రాధే శ్యామ్”. రాధ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీపై వరుసపెట్టి ఇస్తున్న అప్డేట్స్ తో ఒక్కసారిగా అంచనాలు మరింత స్థాయికి పెరిగాయి.

అలా అంచనాలు పెంచే విధంగా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు.దానిని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పడంతో దీనితో అదేమిటా అని ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. కేవలం కొన్ని గంటల్లోనే మోస్ట్ అవైటెడ్ గా మారిన ఈ అప్డేట్ ను మొత్తానికి చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఇటీవలే పూజా పుట్టినరోజు సందర్భంగా పూజా రోల్ ను రివీల్ చేస్తూ “ప్రేరణ”గా పరిచయం చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రభాస్ రోల్ ను రివీల్ చేసి పరిచయం చేసారు.

ఈ చిత్రం నుంచి ప్రభాస్ ను విక్రమ్ ఆదిత్య గా పరిచయం చేస్తూ స్టన్నింగ్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో ప్రభాస్ ఫుల్ ఆన్ స్టైలిష్ అండ్ క్లాస్ గా కనిపించి అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు. పార్కింగ్ లో ఉన్న వింటేజ్ కార్ పై అలా కూర్చొని ఉన్న ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రభాస్ కు అడ్వాన్స్ బర్త్ డే విషెష్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చెప్పినట్టుగానే సర్ప్రైజ్ ను ఒకేసారి ఇచ్చేసారు. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

సంబంధిత సమాచారం :

More