“రాధే శ్యామ్” టీం రాక అప్పుడే.?

Published on Oct 29, 2020 3:03 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. అయితే పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలను నెలకొల్పుకున్నా ఈ భారీ చిత్రం షూటింగ్ అంతిమ దశలో ఉంది.

ఇటీవలే ఇటలీలో షూటింగ్ కు గాను అక్కడకు వెళ్లి కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. ఇక అక్కడ నుంచే చిత్ర యూనిట్ పలు ఆసక్తికర అప్డేట్స్ ను కూడా వదిలారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ టీం అక్కడ షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ వచ్చే అక్టోబర్ 31న భారత్ కు తిరుగు ప్రయాణం కానున్నట్టు టాక్.

ఇప్పటికే ఈ కరోనా లాంటి కష్ట కాలంలో ఇతర దేశాలకు వెళ్ళడానికి ఎవరూ డేర్ చెయ్యడం లేదు. కానీ వీరి టీం వెళ్లి దాన్ని సుసాధ్యం చేసుకొని సక్సెస్ ఫుల్ గా తిరిగి వస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More