లేటెస్ట్..”రాధే శ్యామ్” ట్రైలర్ నిడివి కన్ఫర్మ్..!

Published on Dec 21, 2021 7:10 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్”. ప్రభాస్ అభిమానులు సహా పాన్ ఇండియా వీక్షకులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని ఫిక్స్ చేశారు. అదే ఈ సినిమా ట్రైలర్.

ఈ డిసెంబర్ 23న చేసే మొట్టమొదటి నేషనల్ లెవెల్ ఈవెంట్ లో దాన్ని రిలీస్ చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు ఎంతసేపు కట్ చేశారో క్లారిటీ వచ్చింది. దాని ప్రకారం ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 3 సెకన్లు వచ్చిందట. మరి దర్శకుడు రాధాకృష్ణ ఎలాంటి విజువల్స్ చూపిస్తాడో చూడాలి. ఇక ఈ భారీ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించగా వచ్చే జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :