“రాధే శ్యామ్” ఖచ్చితంగా మరో లోకానికి తీసుకెళ్ళేలానే ఉంది.!

Published on Jun 15, 2021 1:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంకా కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉంచుకుంది. అయితే ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని అలాగే ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

ఇటలీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ వింటేజ్ డ్రామా ఖచ్చితంగా మరో లక్నికి తీసుకెళ్లడం ఖాయమని మరో సారి ప్రూవ్ అవుతుంది. తాజాగా ఈ చిత్రంలోని కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకి వచ్చాయి ఆ లొకేషన్స్ చూస్తేనే ఈ చిత్రం గ్రాండియర్ గా అందంగా ఉండనుందో అర్ధం అవుతుంది.

అలాగే ఒక సాంగ్ లొకేషన్ కూడా బయటకి వచ్చినట్టు అనిపిస్తుంది. దానితో కూడా డైరెక్టర్ రాధా ఖచ్చితంగా ఏదో గ్రాండ్ గానే చూపించనున్నట్టు అర్ధం అవుతుంది. మరి మొత్తంగా మాత్రం రాధే శ్యామ్ ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లడం అనేది క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఈ మెగా ట్రీట్ ను థియేటర్స్ లో విట్నెస్ చేసే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :