అప్పుడు మిస్సయిన ట్రీట్ “రాధే శ్యామ్”లో గ్యారంటీ.!

అప్పుడు మిస్సయిన ట్రీట్ “రాధే శ్యామ్”లో గ్యారంటీ.!

Published on Oct 20, 2020 10:00 AM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న “రాధే శ్యామ్” నుంచి రానున్న ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కించడం మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి.

దీనికి ముందు ప్రభాస్ చేసిన చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో” మిస్సయిన ట్రీట్ ను ప్రభాస్ ఫ్యాన్స్ కు రాధే శ్యామ్ తో రాధా కృష్ణ ఇవ్వనున్నాడు. సాహో లో ప్రభాస్ ఫ్యాన్స్ కు అతని లుక్స్ పరంగా చాలా నిరాశ చెందారు. సాంగ్స్ లో చాలా స్టన్నింగ్ లుక్స్ లో కనిపించిన ప్రభాస్ ఇతర సన్నివేశాల్లో కనిపించిన యావరేజ్ లుక్స్ తో అడ్జస్ట్ కాలేకపోయారు.

కానీ ఈసారి రాధే శ్యామ్ లో మాత్రం ప్రభాస్ లుక్స్ విషయంలో దర్శకుడు బాగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వింటేజ్ డ్రెస్సింగ్ లో ప్రభాస్ లేటెస్ట్ ఆన్ లొకేషన్ స్టిల్స్ చూస్తేనే అర్ధం అవుతుంది ప్రభాస్ ను విజువల్ గా ఎంత బాగా చూపిస్తారో అన్నది.
ముఖ్యంగా బ్లాక్ డ్రెస్సింగ్ లో అయితే ప్రభాస్ మెస్మరైజ్ చేస్తాడని తెలుస్తుంది. దీనితో ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా మాత్రం మంచి ట్రీట్ గ్యారంటీ అని చెప్పాలి. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు