రాధే శ్యామ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

Published on Aug 10, 2021 2:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియన్ సినిమా వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకోబోతుంది.

అయితే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా నుంచి పాటలు ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న చర్చ అయితే జరగలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి మొదటి పాటను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారట. చూడాలి మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది.

సంబంధిత సమాచారం :