ఆ స్టార్ హీరోయిన్‌కు కరోనా లేదట

ఆ స్టార్ హీరోయిన్‌కు కరోనా లేదట

Published on Mar 31, 2020 8:00 PM IST

హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయని కనికా కపూర్ కోవిడ్ 19కు గురికావడంతో ఇతర నటీనటుల మీద అందరి చూపు పడింది. ఏ చిన్న అనుమానం వచ్చినా వారికి వైరస్ సోకిందేమోనని కంగారుపడిపోతున్నారు. తాజాగా స్టార్ నటి రాధికా అప్టే హాస్పిటల్లో ఉన్న ఫోటో ఒకదాన్ని ఇన్స్టాలో షేర్ చేశారు. అందులో ఆమె ముఖానికి మాస్క్ వేసుకొని ఉండటం, అది కూడా లండన్లోని హాస్పిటల్ కావడంతో చూసిన వారంతా రాధికా కూడా కరోనా బారిన పడిందా ఏమిటి అంటూ ఆందోళన చెందారు.

కొందరు సన్నిహితులైతే ఆమెకే నేరుగా ఫోన్ చేసి విచారించడం స్టార్ట్ చేశారు. దీంతో రాధికా ఆప్టే క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. తనకు కోవిడ్ 19 లేదని, గర్భవతిగా ఉన్న తన స్నేహితురాలు రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళుతుంటే ఆమెకు తోడుగా వెళ్లానని, ఇక మాస్క్ ధరించింది కరోనా వైరస్ ఎఫెక్ట్ కాకుండా ఉండటం కోసమేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె తన భర్తతో కలిసి లండన్లో క్వారంటైన్లో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు