తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ‘మన రేడియో’ యాప్‌ !

తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ‘మన రేడియో’ యాప్‌ !

Published on Oct 22, 2018 8:55 AM IST

ప్రపంచంలోని తెలుగువారి కోసం ‘మన రేడియో’ మొబైల్‌ యాప్‌ ప్రారంభమైంది. ‘మన సంగీతం మన సంస్కతి’ అన్న టాగ్‌లైన్‌తో నాలుగు స్టేషన్స్‌తో వస్తోంది. లైవ్‌ ఎంటర్‌టెన్మెంట్‌, మనరేడియో, భక్తి, మిలీనియం హిట్స్‌ ఇలా రకరకాల కార్యక్రమాలతో పలుకరిస్తోంది. అమెరికాలో ఉండే మన తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఈ యాప్‌ను నెలకొల్పారు. ఎల్లప్పుడూ మన చేతిలో ఉండే మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ ఎంటర్‌టైన్మెంట్‌ను వినవచ్చు. గతంలో మన సిటీకేబుల్‌ను స్థాపించిన రామకష్ణగారి దివ్యఆశీస్సులతో చక్రి మన రేడియో యాప్‌ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనిల్‌సుంకర, అల్లరినరేష్‌, కుంచెరఘు, ప్రొడ్యూసర్స్‌ అల్లుఅరవింద్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దాము హీరోయిన్‌ పూజా, ఆర్‌ ఎక్స్‌ 100 హీరో కార్తీక్‌, దర్శకుడు శాంబశివరావ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రొడ్యూసర్‌ శ్యామ్‌ప్రసాద్‌గారు మొబైల్‌ యాప్‌ లోగోను లాంచ్‌ చేశారు. అల్లరి నరేష్‌ రేడియో యాప్‌ను లాంచ్‌ చేశారు. ప్రముఖ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ డివోషనల్‌ స్టేషన్‌ను లాంచ్‌ చేవారు.

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ… ఇది కొత్త ఫీల్డ్‌. మేమంతా రాజకీయలంటూ తిరుగుతూ వచ్చాం. మనరేడియో ప్రవాస తెలుగువారి కోసం ప్రత్యేకంగా చేశారు. ఎక్కడో ఉన్న తెలుగువారికి మన జిల్లాలోని వార్తలు వినవచ్చు వార్తలు వినాలంటే ఒకప్పుడు ఆల్‌ ఇండియా రేడియో ద్వారా వినేవాళ్ళం. ప్రస్తుతం అన్ని రేడియోల ద్వారా వార్తలు వినే అవకాశం వచ్చింది. మొమైల్‌ ద్వారా అన్ని వినవచ్చు. మొబైల్‌ మన దగ్గరుంటే రేడియో జేబులో ఉన్నట్టేనని పేర్కొన్నారు.

ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత అనిల్‌ సుంకర మాట్లాడుతూ… వంశీ కడియాల నా క్లాస్‌మేట్‌. గత ఏడాది ప్రారంభిద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. ఇక ఆలస్యం చెయ్యకుండా నేను స్టార్ట్‌ చేస్తా అంటూ ముందుకు వచ్చాడు. దీని కోసం చాలా కష్టపడ్డారు. వేరే దేశాలలో ఉండేవారు ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో ఎక్కువ శాతం కారులో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా రేడియోనే వింటారు. ఎప్పుడూ ఇంగ్లీష్‌ స్టేషన్‌లు వినే వాళ్ళకి తెలుగు వింటుంటే మన ఇంటికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కాకుండా డివోషనల్‌ స్టేషన్‌ కూడా చాలా బావుంటుంది. అందరూ ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా కోరుతున్నాను అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ…మన తెలుగువాళ్ళు అమెరికాలో తెలుగువాళ్ళకు కావల్సిన వాళ్ళ ఆకలిని గుర్తించి ఒక స్టేషన్‌లో మాతభాషలో వస్తుంది. అనిల్‌ నాకు చెప్పినప్పుడు పెద్దగా నాకు దాని గురించి చెప్పలేదు. ఇది. ఎంతో సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు