ఎలాగైనా సరే ఈ సినిమాను బాగా ఆడించు – దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
Published on Sep 11, 2018 6:37 pm IST


నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్ కంచెర పాలెం’ విడుదల అవ్వకముందే, ప్రివ్యూ షోల ద్వారా సినీ ప్రముఖుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా ప్రేక్షకులను ఇంకా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇంత మంచి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ పై ‘రానా దగ్గుబాటి’ సమర్పించిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్ర బృందంపై, ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సురేష్ బాబు పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విషయాన్ని స్వయంగా సురేశ్ బాబు ఈ రోజు జరిగిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సక్సెస్ మీట్ లో తెలిపారు. దర్శకేంద్రుడు, సురేష్ బాబుతో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా నాకు బాగా నచ్చింది. ఇంలాంటి కథాబలం ఉన్న చిత్రాలు హిట్ అయితే.. అది ఇండస్ట్రీకి చాలా మంచిది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి చక్కని చిత్రాలు మరిన్ని వస్తాయి. ఎలాగైనా సరే ఈ సినిమాను బాగా ఆడించు. త్వరలో పెద్ద సక్సెస్ ఫంక్షన్ ఏర్పాటు చెయ్. ఆ కార్యక్రమానికి నేను కూడా వచ్చి చిత్రబృందానికి షీల్డులు పంచుతా’ అని తనతో రాఘవేంద్రరావు ఫోన్ లో మాట్లాడారని సురేశ్ బాబు చెప్పారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook