ఫస్ట్ లుక్ తో వచ్చిన ‘రాహు’ !

ఫస్ట్ లుక్ తో వచ్చిన ‘రాహు’ !

Published on Aug 8, 2019 12:25 PM IST

సుబ్బు దర్శకత్వంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రాహు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. కొత్త సబ్జెక్ట్స్ తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమాని రివల్యూషనైజ్ చేస్తున్నారు. ఇది కూడా అలాటి ఒక న్యూ ఏజ్ సినిమా అవుతుంది అని డైరెక్టర్ సుబ్బు అన్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ అంటున్నారు.

ఈ సినిమాకు డిఓపి – సురేష్ రగుతు, మ్యూజిక్ – లక్కరాజు, ఎడిటింగ్ – అమర్ రెడ్డి వంటి సాంకేతిక నిపుణుల సహకారంతో టెక్నికల్ గా హై స్టాండర్ఫ్స్ లో ఈ థ్రిల్లర్ సినిమా ఉండనుంది. ఇక ఈ సినిమాలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం – సుబ్బు వేదుల నిర్మాతలు – ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల, ఎడిటింగ్ – అమర్ రెడ్డి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు