ఆమెకోసం సపరేట్ గా కట్ చేశానంటున్న నాగ్ దర్శకుడు

Published on Jun 14, 2019 8:26 am IST

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న మూవీ “మన్మధుడు 2”. నటుడు రాహుల్ రవీంద్ర దర్శకుడిగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఐతే నిన్న విడుదలైన ఈ మూవీ టీజర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.వయసు మీద పడినా పెళ్లికాని మధ్య వయస్కుడిగా నాగార్జున నటన బాగుంది.

ఈ టీజర్ లో ఒక్క హీరోయిన్ కూడా కనిపించకపోవడం ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురిచేసింది. ఇదే విషయమై దర్శకుడు రాహుల్ రవీంద్రను సంప్రదించగా ఆయన కొన్ని ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ మూవీలో రకుల్ తో పాటు నటిస్తున్న కీర్తి సురేష్, సమంత కేవలం అతిధి పాత్రలలో మాత్రమే కనిపిస్తారట. ఫుల్ టైం హీరోయిన్ మాత్రం రకుల్ ఒక్కరే. టీజర్ లో హీరోయిన్ ని చూపించక పోవడానికి కారణం హీరోయిన్ పై ప్రత్యేకంగా ఓ టీజర్ ని దర్శకుడు కట్ చేసారంట. అందుకే రకుల్ ని మొదటి టీజర్ లో చూపించలేదు అని ఆయన తెలిపారు. మన్మధుడు 2 ఆగస్టు 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More