అమెరికా పోస్టల్ సర్వీస్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారి జన్మదిన కానుకగా ఆయన పేరుమీద స్టాంప్ విడుదల చేసిన విషయం మేము మీకు ముందుగానే తెలిపాం.
ఇప్పుడు మరో తెలుగు తేజాన్ని అమెరికా పోస్టల్ స్టాంప్ లపై చిత్రీకరించనున్నారు. స్వర్గీయ ఘంటసాల గారి పోస్టల్ స్టాంప్ ని నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ మరియు తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ (NATS and TLCA) సంస్థలు సంయుక్తంగా కలిసి న్యూ యార్క్ లో విడుదలచేయనున్నారు
తన సుస్వరమైన గానామృతంలో మనల్ని పరవశింపజేసిన మహాత్మునికి ఇది సరైన గౌరవమనే చెప్పాలి.


