హ్యాట్రిక్ హిట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్న యంగ్ హీరో!

హ్యాట్రిక్ హిట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్న యంగ్ హీరో!

Published on Nov 19, 2015 2:00 PM IST

raj-tarun

హ్యాట్రిక్ హీరో అనిపించుకోవడమనేది ఏ భాషా సినీ పరిశ్రమలో అయిన ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఇలాంటి పరిశ్రమలో వరుసగా మూడు హిట్స్ రావడమనేది ఆ హీరో స్థాయిని పెంచే ఫీట్‌గానే నిలుస్తుందని చెప్పొచ్చు. తాజాగా ఈ కోవలో ‘కుమారి 21 ఎఫ్’తో ఈ ఫీట్‌ను సాధించేందుకు యువహీరో రాజ్ తరుణ్ సిద్ధమైపోయారు. సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది.

సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈతరం ప్రేమ, ఆలోచనలను బోల్డ్‌గా చెప్పిన సినిమాగా ప్రచారం పొందుతూ వస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలను రేకెత్తిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో కూడా యూత్‌లో పాగా పాపులర్ అయిపోయింది. ఇక ప్రస్తుతం యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజ్ ఉన్న సినిమాల్లో ‘కుమారి 21F’ ఒకటి కావడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై రాజ్ తరుణ్ కూడా మొదట్నుంచీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తన గత రెండు చిత్రాలైన ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’ సినిమాలకు భిన్నంగా నడిచే ఈ సినిమా తనకు తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో రాజ్ తరుణ్ ఉన్నారు. మరి సినిమా అంచనాలను అందుకొని హిట్‌గా నిలిచి రాజ్ తరుణ్‌కు హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందా అన్నది వేచిచూడాలి.

తాజా వార్తలు