హ్యాట్రిక్ హిట్స్ తో రేటు పెంచేసిన యంగ్ హీరో

హ్యాట్రిక్ హిట్స్ తో రేటు పెంచేసిన యంగ్ హీరో

Published on Dec 7, 2015 3:55 PM IST

raj-tarun

మన చేతిలో సక్సెస్ ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా వింటారు.. ఇదే విషయం ఎక్కడ ఎలా పనిచేసినా ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం బాగా పనిచేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పడూ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో రాజ్ తరుణ్. చెప్పాలంటే రాజ్ తరుణ్ హీరో అవ్వాలని రాలేదు డైరెక్టర్ అవుదాం అని ఇండస్ట్రీకి వచ్చాడు కానీ అనుకోకుండా హీరో ఛాన్స్ వచ్చి హీరో అయిపోయాడు. అలా చేసిన మొదటి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21F’ సినిమాలు కూడా పెద్ద హిట్స్ అయ్యి నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చి పెట్టాయి.

దాంతో రాజ్ తరుణ్ ఫుల్ ఖుషీ అయిపోయాడు. అలాగే సక్సెస్ ఉన్నప్పుడే డిమాండ్ కూడా ఉంటుందని భావించి తన రెమ్యునరేషన్ ని పెంచేసాడు. రాజ్ తరుణ్ నుంచి రానున్న నెక్స్ట్ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ సినిమా ముందే కమిట్ అవ్వడం వలన మామూలు రేటే తీసుకున్నాడు. కానీ ఇక చేయబోయే సినిమాలన్నిటికీ దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట ఈ యంగ్ హీరో. ఈ విషయం కొంతమంది నిర్మాతలని షాక్ చేస్తున్నా, కొంతమంది మాత్రం రాజ్ తరుణ్ ని సపోర్ట్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ నెక్స్ట్ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ని జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు