ఈసారి ఎంటర్టైన్మెంట్ ను నమ్ముకున్న యువ హీరో !

ఈసారి ఎంటర్టైన్మెంట్ ను నమ్ముకున్న యువ హీరో !

Published on May 29, 2018 5:18 PM IST

యువ హీరో రాజ్ తరుణ్ గత చిత్రాలు ‘అంధగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాలు పర్వాలేదనిపించినా పెద్ద సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక చివరి చిత్రం ‘రంగుల రాట్నం’ అయితే పరాజయాన్ని మూటగట్టుకుంది. అందుకే రాజ్ తరుణ్ ఈసారి తన సినిమాకొచ్చే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని నిశ్చయించుకుని చేసిన సినిమా ‘రాజుగాడు’.

దొంగతనం చేసే అలవాటున్న హీరో జీవితం ఎలా సాగింది అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని సంజన రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో రెగ్యులర్ అంశాలు ఉండవని, సరదాగా నవ్వు తెప్పించే ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుందని ఆమె అంటున్నారు. మరి ఈ ఎంటర్టైనర్ తో అయినా రాజ్ తరుణ్ కావలసిన సాలిడ్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి. ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనున్న ఈ సినిమాను జూన్ 1న రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు