ఫన్ట్రెస్టింగ్ గా అనిపిస్తున్న “స్టాండప్ రాహుల్” టీజర్.!

Published on Jul 9, 2021 3:40 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సాలిడ్ హిట్ అండ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. మరి కాస్త విరామం అనంతరం చేస్తున్న లేటెస్ట్ సినిమా “స్టాండప్ రాహుల్” ఫస్ట్ లుక్ నుంచి మంచి బజ్ ఈ సినిమా పై క్రియేట్ అయ్యింది. అలా దర్శకుడు సంతూ మోహన్ వీరంకి డిజైన్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి టీజర్ ను మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తో మేకర్స్ విడుదల చేయించారు.

మరి ఈ టీజర్ ని గమనిస్తే ఓవరాల్ గా హిలేరియస్ ఫన్ తో మంచి ఇంట్రెస్టింగ్ గా “ఫన్ట్రెస్టింగ్” గా ఉందని చెప్పాలి. రాజ్ తరుణ్ మరియు వెన్నెల కిషోర్ పై కనిపించిన సీన్స్ కానీ కొన్ని రియాలిటీ డైలాగ్స్ ని ఫన్ జోడించి సెట్ చెయ్యడం ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. అలాగే ఓ స్టేజ్ స్టాండప్ జోక్స్ చెప్పే వాడిలా రాజ్ తరుణ్ అయితే కంప్లీట్ ఫ్రెష్ గా మరింత యంగ్ గా ఈ రోల్ లో కనిపిస్తున్నాడు.అలాగే టాలెంటెడ్ యంగ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ కూడా గ్లామరస్ గా ఇనోసెంట్ గా కనిపించి ఆకట్టుకుంది.

ఇవన్నీ దర్శకుడు బాగా కొత్తగా చూపించారు. ఇక అలాగే స్వీకర్ అగస్తి మ్యూజిక్ శ్రీరాజ్ రవీంద్రన్ సినెమాటోగ్రఫీలు కూడా మంచి ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నాయి. అలాగే నిర్మాతలు నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ల నిర్మాణ విలువలు ఈ చిత్రంలో ఉన్నతంగా కనిపిస్తున్నాయి. మరి మొత్తంగా చూస్తున్నట్టయితే ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి మంచి కం బ్యాక్ థియేటర్స్ నుంచి వచ్చేలానే ఉంది అని చెప్పాలి. ఇక మేకర్స్ ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :