విజయ్ దేవరకొండ కి రాజ్ తరుణ్ థాంక్స్!

Published on Jul 30, 2021 8:32 pm IST

రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్ లుగా, సంతో మోహన్ వీరంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం స్టాండ్ అప్ రాహుల్. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ టాలివుడ్ నటుడు దగ్గుబాటి రానా టీజర్ ను విడుదల చేసారు. అయితే ఈ చిత్రం లో రాజ్ తరుణ్ సరికొత్త లుక్ లో ఉన్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం నుండి ఒక పాట ను అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ విడుదల చేశారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ కుమార్ కొండ అలా ఇలా అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చూడటానికి చాలా స్వీట్ ఫిల్మ్ గా ఉందని పేర్కొన్నారు. అంతేకాక టీజర్ కూడా బావుంది అంటూ కితాబు ఇచ్చారు. అయితే దీని పై రాజ్ తరుణ్ స్పందిస్తూ, థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :