రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రాజ్ తరుణ్ సినిమా !

యంగ్ హీరో రాజా తరుణ్ నటించిన తాజా చిత్రం ‘రాజుగాడు’. నూతన దర్శకురాలు సంజన రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ కూడ మంచి ఫన్ తో నిండి సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రాన్ని మే 11న ప్రేక్షకులకు అందివ్వాలని నిర్మాతలు నిర్ణయించారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ దొంతనం చేసే లోపం ఉన్న కుర్రాడిగా కనిపించనున్నాడు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అమైరా దస్తూర్ రాజ్ తరుణ్ కు జోడీగా నటించింది. గత చిత్రం ‘రంగుల రాట్నం’ పరాజయం చెందడంతో రాజ్ తరుణ్ ఈ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకోవాలని భావిస్తున్నారు .