సెన్సార్ పూర్తిచేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న ‘లవర్స్’ !

Published on Jul 16, 2018 2:40 pm IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవర్స్’. ఇప్పటికే విడుదలైన లవర్స్ ఆడియో ప్రేక్షకులని అలరిస్తూ.. మంచి బజ్ సృష్టించుకుంది. కాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని ‘U/A’ సర్టిఫై తో ఈ నెల 20న గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

సినీవర్గాల సమాచారం ప్రకారం ‘లవర్స్’ చిత్రం మంచి ఎంటర్టైనింగా ఉండనుందని, యదార్ధమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంటుందని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో విడుదలవనున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజ్ తరుణ్ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. రాజ్ తరుణ్ కెరీర్ సజావుగా సాగాలంటే ఇప్పుడు అతనికి ఈ చిత్రం ఖచ్చితంగా విజయవంతం అయి తీరాలి.

సంబంధిత సమాచారం :

X
More