ఆ సినిమాకు బ్రేకులు వేసేది ‘రాజా సాబే’..?

ఆ సినిమాకు బ్రేకులు వేసేది ‘రాజా సాబే’..?

Published on Jan 4, 2026 1:00 AM IST

రాజాసాబ్

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ 2025లో బాలీవుడ్‌కు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, ప్రారంభంలో వచ్చిన నెగెటివ్ ప్రచారాన్ని తట్టుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నాలుగు వారాలు పూర్తైనా కూడా నార్త్ ఇండియాలో థియేటర్లకు ప్రేక్షకులు భారీగా వస్తుండటంతో సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు.

కొత్త సినిమాలు విడుదలవుతున్నా కూడా ధురంధర్ డబుల్ డిజిట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. సమీప భవిష్యత్తులో పెద్ద బాలీవుడ్ సినిమాలు లేకపోవడంతో, ఈ సినిమా భారత్‌లో ఆల్‌టైమ్ టాప్-5 వసూళ్ల చిత్రాల్లోకి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ సర్క్యూట్లలో ఈ సినిమాకు గట్టి హోల్డ్ కొనసాగుతోంది.

ఇలాంటి సమయంలో ధురంధర్ దూకుడుకు పోటీ ఇవ్వగల సినిమా ప్రభాస్ నటించిన పాన్-ఇండియా హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ అని చెప్పాలి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. నార్త్ ఇండియాలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ కారణంగా రాజా సాబ్ భారీ ఓపెనింగ్ సాధించే ఛాన్స్ ఉంది. అయితే మంచి టాక్ వస్తేనే ధురంధర్ జోరు తగ్గే అవకాశం ఉంటుంది, లేకపోతే మరో కొన్ని వారాలు ధురంధర్ బాక్సాఫీస్‌ను ఏలే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు