రాజా సాబ్ ట్రైలర్ టాక్ : హారర్ ఎలిమెంట్‌తో ఫన్ క్రియేట్ చేసే ప్రభాస్-మారుతి కాంబో…!

రాజా సాబ్ ట్రైలర్ టాక్ : హారర్ ఎలిమెంట్‌తో ఫన్ క్రియేట్ చేసే ప్రభాస్-మారుతి కాంబో…!

Published on Dec 29, 2025 3:31 PM IST

The-Raja-Saab

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్-కామెడీ చిత్రం సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా ఇది సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.

ఈ సినిమాలో ప్రభాస్ తాతయ్యగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపిస్తున్నాడు. ఆయన మరణానంతరం ఓ అజేయమైన దుష్టశక్తిగా మారి, ఒక బంగ్లాలో ఆత్మగా నివసిస్తుంటాడు. తాత గురించి నిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభాస్ ఆ బంగ్లాకు వెళ్తాడు. అయితే తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని అతడు గ్రహించలేడు. ఆ భవనంలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి సంజయ్ దత్ మాయలో చిక్కిపోతుండటం, అతని శక్తి ఎంత భయంకరమో చూపిస్తుంది. ప్రభాస్ తన స్నేహితులతో కలిసి అక్కడ చిక్కుకుపోతాడు. సంజయ్ దత్ పాత్ర వెనుక అసలు రహస్యం ఏమిటి? హీరో ఎదుర్కొనే అనుభవాలు ఏంటి? చివరకు కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే ప్రశ్నలతో ట్రైలర్ ప్రేక్షకుల్లో తీవ్రమైన క్యూరియాసిటీని రేకెత్తిస్తూ, సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్‌తో పాటు బొమన్ ఇరానీ, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు