వినూత్నంగా ‘రాజావారు రాణిగారు’ !

Published on Apr 29, 2019 9:52 pm IST

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఆడు రాయాల్సిన ప‌రీక్ష ఒక‌టుంది, గీతా గీతా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌వే….. ఓక సారి ఎంపైర్ ఔట్ అంటే ఔటే.. లాంటి స్టేటస్ ల‌తో ఇంట్ర‌స్టింగ్ పోస్ట్ ల‌తో యూత్ ని ఆక‌ట్ట‌కున్నారు ఎస్‌.ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు. ఈ రోజు ఎస్‌.ఎల్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్ వారు తమ సినిమా ‘రాజావారు రాణిగారు’ అని తెలుపుతూ టైటిల్ పోస్టర్ని విడుదల చేసారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌నోవికాస్ డి మాట్లాడుతూ.. డిజిటల్ ఫ్లాట్‌ ఫామ్ లొ మూవీ ల‌వ‌ర్స్ బాగా ఎక్కువ‌య్యారు. సినిమా అప్‌డేట్స్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా చిత్ర యూనిట్ ముందుగా సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మేం పెట్టిన ఇంట్రస్టింగ్ స్టేట‌స్ లకు హ్యూజ్ రెస్పాన్స్ రావ‌టం విశేషం. అని తెలిపారు.

ఎస్‌.ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, రహ‌స్య గోర‌ఖ్ లు జంట‌గా ర‌వికుమార్ కొలా ద‌ర్శ‌క‌త్వం లో నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ‘రాజా వారు రాణి గారు’. ఈ చిత్రం వినూత్నంగా ఉంటుందట. ఈ చిత్రానికి జ‌య్ క్రిష్ సంగీతాన్ని అందిస్తున్నాడు, మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అని అన్నారు.

సంబంధిత సమాచారం :