“రాజా విక్రమార్క” నుంచి సర్ప్రైజింగ్ డాన్స్ వీడియో.!

Published on Nov 11, 2021 4:34 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా “రాజా విక్రమార్క” రేపు రిలీజ్ కి రెడీగా ఉంది. దర్శకుడు శ్రీ సారిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం పై డీసెంట్ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ యంగ్ హీరో సాలిడ్ లుక్స్ తో పాటు డాన్స్ కూడా చాలా బాగా చేస్తాడని తెలిసిందే.

అలానే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ డాన్స్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది కార్తికేయ, హీరోయిన్ తాన్యా ల మధ్య నడిచే వెస్ట్రన్ నెంబర్ ని సింగిల్ టేక్ లో 360D కెమెరాలో టాలీవుడ్ యంగ్ కొరియోగ్రాఫర్ యష్ వర్క్ చేసాడు. వీరిద్దరి మధ్య ఈ సాంగ్ మాత్రం మంచి కెమిస్ట్రీ ఇందులో కనిపిస్తుంది. సాలిడ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 88రామా రెడ్డి నిర్మాణం వహించగా రేపు నవంబర్ 12న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :