అందుకే అజయ్ దేవగణ్ ను తీసుకున్నాను – రాజమౌళి

అందుకే అజయ్ దేవగణ్ ను తీసుకున్నాను – రాజమౌళి

Published on Apr 20, 2020 4:48 PM IST

rajamouli
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో అజయ్ దేవగణ్ పాత్ర గురించి, అలాగే అజయ్ దేవగణ్ నే ఎందుకు తీసుకున్నాననే విషయం గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. రాజమౌళి చెప్తూ.. ‘ఇతను చెప్పింది కరెక్ట్.. ఇతని మాట్లాడిన మాట ప్రతిదీ నిజమే అని బలంగా అనిపించాలి. అజయ్ దేవ్‌గణ్ ఒక విషయం చెబితే అది మనకు నిజమే అనిపిస్తోంది. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. అందుకే ఆయనను ఆర్ఆర్ఆర్ లో తీసుకున్నాను అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పాడు.

ఇక అజయ్ దేవగణ్ కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారట. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారట. అయినప్పటికీ.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ప్రేరణాత్మకంగా ఉండనుందని సమాచారం.

కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు