మహేష్ తో రాజమౌళి అడ్వెంచర్ థ్రిల్లర్‌ !

Published on Jul 26, 2021 6:49 am IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మహేశ్‌ సినిమా పనులు ఎక్కడి వరకూ వచ్చాయి అని యాంకర్న్న అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇంకా స్క్రిప్టు దగ్గరే ఉన్నాను. కరోనా సమయంలో ఏ పనీ సరిగ్గా పూర్తి కాలేదు. ఒకసారి రాజమౌళి నా దగ్గరికి వచ్చి మహేశ్‌ తో సినిమా చేయాలనుకుంటున్నాను అని ఒక కథ కావాలని అడిగాడు.

అయితే, రాజమౌళి ఎలాంటి కథ కావాలో చెబుతూ… ‘ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా మూవీ ఉండాలని అడిగారు. నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ విజయేంద్రప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా కూడా మల్టీస్టారరే.. ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ను అన్ని వర్గాల వారికీ, అందరి హీరోల ఫ్యాన్స్ కి ఇంకా బాగా దగ్గర చేయాలనే రాజమౌళి ప్లాన్ అట.

సంబంధిత సమాచారం :