సాహో టీజ‌ర్‌కు రాజమౌళి సర్టిఫికెట్

Published on Jun 13, 2019 5:59 pm IST

హెవీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. విడుదలకు ముందు వరకు అభిమానులు, ప్రేక్షకుల్లో కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజీత్ ఇంత పెద్ద సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అని కంగారుపడ్డారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఖచ్చితంగా బాగుండాలని.. మరి సుజీత్ టేకింగ్ ఎలా ఉంటుందో అని సంకోచించారు. కానీ టీజర్ చూశాక అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి.

అభిమానులు, అన్ని పరిశ్రమ ప్రేక్షకులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి టీజర్ బాగుందని కితాబిచ్చారు. నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బడ్జెట్‌కు న్యాయం చేస్తే దర్శకుడు సుజీత్ తన బాధ్యతకు న్యాయం చేశాడని అంటూ ప్రభాస్‌ను సైతం డార్లింగ్ అంటూ పొగిడేశారు. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాను హ్యాండిల్ చేసి భారీ బడ్జెట్ చిత్రాలు రూపకల్పనలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో స్పష్టమైన అనుభవం ఉన్న రాజమౌళి టీజర్ పాసైనట్టు సర్టిఫికెట్ ఇవ్వడంతో అభిమానులతో పాటు చిత్ర టీమ్‌కు కూడా ధైర్యాన్నిచ్చే విషయం.

సంబంధిత సమాచారం :

More