‘రుద్రమదేవి’ 3డీ ఎఫెక్ట్స్‌పై రాజమౌళి కామెంట్స్

‘రుద్రమదేవి’ 3డీ ఎఫెక్ట్స్‌పై రాజమౌళి కామెంట్స్

Published on Oct 8, 2015 1:21 AM IST

rajamouli
దర్శకుడు గుణశేఖర్ ఏళ్ళ తరపడి శ్రమించి తెరకెక్కించిన కలల ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. భారతదేశపు మొట్టమొదటి 3డీ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, మళయాలంలో ఒకేసారి 2డీ, 3డీ వర్షన్స్‌లో రిలీజ్ కాబోతోంది. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంతటా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతూండడంతో ప్రస్తుతం ‘రుద్రమదేవి’ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక సినీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలుగులో వస్తోన్న ఓ హిస్టారికల్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఇండస్ట్రీ ఈ సినిమాను ప్రత్యేకంగా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి సైతం రుద్రమదేవి సినిమాపై ఉన్న ఆసక్తిని బయటపెట్టారు. ఈ సాయంత్రం రుద్రమదేవి సినిమా గురించి రాజమౌళి తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కామెంట్స్ చేశారు.

రుద్రమదేవి కొత్త ట్రైలర్ చాలా బాగుందని, అనుష్క రుద్రమదేవి పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తుందని తెలిపారు. ఇక తనకు అందిన సమాచారం మేరకు 3డీ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చాయని తెలుపుతూ, తనకు 3డీ కంటే 2డీలో చూడడం ఇష్టమైన కూడా ఫ్యామిలీ కోరిక మేర రుద్రమదేవిని 3డీలోనే చూడనున్నానని స్పష్టం చేశారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్‌తో రుద్రమదేవి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగిందనే చెప్పాలి.

తాజా వార్తలు