
2015 అనే ఏడాది తెలుగు చిత్ర సీమకి ఎంతో గర్వంగా ఫీలయ్యేలా చేసిన ఏడాది.. ఎందుకంటే ఈ ఏడాది టాలీవుడ్ స్థాయిని సౌత్ నుంచి హాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’ విడుదలై, కలెక్షన్స్ పరంగా ఇండియన్ బాక్స్ ఆఫీసు ని కొల్ల గొట్టింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా రిలీజ్ అవ్వడానికి సిద్దమైంది. ముందుగా బాహుబలి చైనా, జపాన్, లతో పాటు పలు ఏషియన్ కంట్రీస్ లో కూడా రిలీజ్ కానుంది. ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ ఘనతని తెచ్చి పెట్టిన క్రెడిట్ దర్శకధీరుదు ఎస్ఎస్ రాజమౌళికే చెందింది.
బాహుబలి తర్వాత తెలుగుతో అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బాహుబలి పార్ట్ 2 ని మొదలు పెట్టారు. ఇటీవలే ఈ చిత్ర టీంతో కలిసి స్క్రిప్ట్ పరంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసిన రాజమౌళి బాహుబలి 2 కోసం నేటి నుంచి అసలైన వర్క్ ని స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ మరియు మకుట విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్స్ తో కలిసి బాహుబలి పార్ట్ 2 కోసం వేయబోయే సెట్స్ కోసం లొకేషన్స్ చూస్తున్నారు. బాహుబలి రెండవ పార్ట్ ఫస్ట్ పార్ట్ కన్నా బెటర్ గా ఉండాలని వార్ ఎపిసోడ్ ని మళ్ళీ రీ డిజైన్ చేసారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదట్లో బాహుబలి 2 సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు కూడా తమ పార్ట్ షూటింగ్ కోసం సిద్దమవుతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తాడు.

