“RRR”లో రాజమౌళికి అతడి పాత్రే ఒకింత ఎక్కువ ఇష్టం.!

“RRR”లో రాజమౌళికి అతడి పాత్రే ఒకింత ఎక్కువ ఇష్టం.!

Published on Jan 25, 2022 10:00 AM IST


అసలు టాలీవుడ్ లో ఎవరూ ఊహించని ఒక బిగ్ మల్టీ స్టారర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సెట్ చేశారు. ఈ కాంబో అనౌన్స్ చేసినప్పుడు నుంచే భారీ స్థాయి అంచనాలు పాన్ ఇండియన్ లెవెల్లో నెలకొన్నాయి. “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ నుంచి ప్రతి అంశాన్ని చాలా ఆసక్తిగా మలచిన తర్వాత ఎట్టకేలకు ఈ భారీ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాలో అందరి మదిని తొలిచేసే ఓ ఆసక్తికర ప్రశ్న ఎప్పుడు నుంచో ఉంది. ఇలాంటి ఒక ఇద్దరు మాస్ హీరోలను పెట్టి ఎవరినీ తక్కువ చేయకుండా రాజమౌళి ఎలా తీసి ఉంటారు అని? అయితే ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఇచ్చేలానే సీన్స్ ఉంటాయని మేకర్స్ ఎన్నో మార్లు చెప్పుకొచ్చారు అలానే లేటెస్ట్ ట్రైలర్ లో కూడా చూపించారు.

కానీ రాజమౌళికి సినిమాలో ఎవరి పాత్ర ఒకింత ఎక్కువ ఇష్టమో అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది. తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఇద్దరు హీరోలు చేసిన పాత్రలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లలో చరణ్ చేసిన రామ్ పాత్ర ఒకింత ఎక్కువ ఇష్టం అని చెప్పడం జరిగింది. దీనితో ఇప్పుడు ఈ మాటలే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు