ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ అప్డేట్..!

Published on Dec 10, 2019 11:06 pm IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసిచేస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్. వీరిద్దరూ కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజులుగా నటిస్తుండగా ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు వైజాగ్ లోని విశాఖ ఏజెన్సీ అయిన మోదాపల్లి, డల్లాపల్లి మండలాల్లో కాఫీ తోటల్లో ఈ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారట. నేటి నుండి దాదాపు వారం రోజుల పాటు సినిమాకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఇవి ఆర్ ఆర్ ఆర్ కు సంబందించిన క్లైమాక్స్ సన్నివేశాలు అని కూడా తెలుస్తుంది. ఐతే దీనిపై స్పష్టత లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న రాజమౌళి షూటింగ్ చివరి దశకు తీసుకొచ్చారని తెలుస్తుంది.

డి వి వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 300కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుండగా, బ్రిటిష్ భామ ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More