బాహుబలి 2 ట్రైలర్ పనిలో బిజీగా రాజమౌళి !


విడుదల సమయం దగ్గర పడుతుండడంతో రాజమౌళి బాహుబలి 2 ప్రమోషన్స్ ని నిన్న శివరాత్రి సందర్భంగా మొదలు పెట్టారు. బాహుబలి 2 ట్రైలర్ ని మార్చిలోనే విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం దానికి సంబందించిన వర్క్ జరుగుతోందని రాజమౌళి అన్నారు.

బాహుబలి 2 దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఇప్పటికే ట్రైలర్ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైలర్ ని మార్చి నెలలో భారీ ఈవెంట్ నిర్వహించి విడుదల చేసే అవకాశం ఉంది.