“RRR” లో జెన్నీ పాత్రపై ఆసక్తికర నిజం రివీల్ చేసిన రాజమౌళి

“RRR” లో జెన్నీ పాత్రపై ఆసక్తికర నిజం రివీల్ చేసిన రాజమౌళి

Published on Mar 19, 2024 1:59 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కెరీర్ లో గేమ్ ఛేంజింగ్ సినిమాగా నిలిచిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” (RRR Movie). దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ మాసివ్ యాక్షన్ డ్రామా గ్లోబల్ వైడ్ గా భారీ గుర్తింపు తెచ్చుకొని అదరగొట్టింది. అయితే ఈ చిత్రంలో అనేకమంది ఇంగ్లీష్ నటీనటులు కూడా కీలక పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.

మరి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ (Olivia Morris) కూడా ఒకరు. మరి ఈమె ఈ చిత్రంలో జెన్నీ అనే పాత్రలో కనిపించగా ఈమె పాత్ర విషయంలో రాజమౌళి చెప్పిన ఆసక్తికర నిజాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాము ముందుగా జెన్నీ పాత్రకి విషాదాంతం రాశామని, భీమ్ రామ్ పాత్రని జైలు నుంచి తప్పించిన తర్వాత భీమ్ కి జెన్నీ సాయం చేసే నేపథ్యంలో ఆమె పాత్ర మరణిస్తుంది అను ముందు రాసుకున్నామని తెలిపారు. అయితే తర్వాత మరీ ఎమోషనల్ ఎండింగ్ లా ఉంటుందేమో అని బ్రతికి ఉన్నట్టే డిజైన్ చేయడంతో అది అందరికీ నచ్చింది హ్యాపీ ఫీల్ అయ్యారు అని రాజమౌళి ఈ పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు