తారక్, చరణ్ ల విషయంలో రాజమౌళి గట్టి ప్లానే వేసారే.!

Published on Nov 24, 2020 2:02 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అన్ని కోణాల్లోనూ భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియన్ మార్కెట్ కు ఎలా ఉండాలో అలానే ప్లాన్ చేస్తున్నారు.

అయితే హిందీ విషయంలో జక్కన మాత్రం గట్టి ప్లానింగ్ లే చేస్తున్నారట. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో చరణ్ మరియు తారక్ లు చేస్తున్న అల్లూరి సీతా రామరాజు అలాగే కొమురం భీం పాత్రలను ఇంట్రడ్యూస్ చెయ్యడానికి బాలీవుడ్ స్టార్ హీరోను లైన్ లో పెట్టారని టాక్ వినిపిస్తుంది.

అతను మరెవరో కాదు బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అయినటువంటి అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ తో ఇంట్రడ్యూస్ చేయనున్నారట. రాజమౌళి ఆమీర్ కు పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాకు ఆయనతో హిందీలో చెప్పించారట. మరి మిగతా భాషల్లో ఎవరెవరు చెబుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More