‘మెగా, నందమూరి’ ఫ్యాన్స్ కు రాజమౌళి సర్‌ ప్రైజ్!

Published on Mar 7, 2022 7:30 pm IST


చిరు, బాలయ్య ఒక వేదిక పైకి వస్తే చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. ఎంతైనా నాలుగు దశాబ్దాలుగా సమఉజ్జీలుగా కొనసాగుతున్న హీరోలు వీళ్ళు. అందుకే.. ఈ కలయిక పై ఎప్పటికప్పుడు రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే, ఈ సారి ఈ ఇద్దరి కలయిక రూమర్ కాదు, నిజమే అని తెలుస్తోంది. త్వరలో గ్రాండ్‌ గా జరగనున్న ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్‌ కు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు.

ఇప్పటివరకు అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానప్పటికీ.. త్వరలోనే ఈ వార్తకు సంబధించి ఇన్విటేషన్ రాబోతుంది అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి.

సంబంధిత సమాచారం :