రజినీకాంత్ ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్

ss-rajamouli
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘విక్రమ సింహా'(కొచ్చాడియాన్) కర్టన్ రైజర్ ఈవెంట్ ఏప్రిల్ 19న హైదరాబాద్ ఐ మాక్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు డా. దాసరి నారాయణరావు, దా. మోహన్ బాబు, డా.డి. రామానాయుడు కూడా హాజరు కానున్నారు.

వీరు కాకుండా ఈ చిత్ర టీం అయిన రజినీకాంత్, దీపికా పడుకొనే డైరెక్టర్ సౌందర్య అశ్విన్ తదితరులు హాజరు కానున్నారు. మే 9న సుమారు 6 భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఈ రోస్ ఇంటర్నేషనల్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version