ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మానేస్తా అంటున్న రాజమౌళి.. !

Published on Dec 19, 2019 7:05 am IST

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇస్తా అంటున్నాడు. ఈ నెల 25న ఆయన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి మానేస్తా అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనికి కారణం ఆ రోజు రాజమౌళి మత్తు వదలరా సినిమాకి వెళ్ళాలట. విషయంలోకి వెళితే రాజమౌళి కుటుంబానికి చెందిన యువకులు ఓ చిత్రం చేయడం జరిగింది. శ్రీ సింహ హీరోగా పరిచయమవుతూ.. కీరవాణి కుమారుడు కాలభైరవ స్వరకల్పనలో మత్తు వదలరా మూవీ రూపొందింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రితేష్ రానా సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించారు. నిన్న ఈ మూవీ ట్రైలర్ ని రానా దగ్గుబాటి విడుదల చేయడం జరిగింది. ఈ మూవీ ఈనెల 25న విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళి ఆ సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్ళు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీ తో సినీ అరంగేట్రం చేస్తున్నారు. నేను భావోద్వేగానికి గురవుతున్నాను. దర్శకుడు రితేష్ రానా బాగా తీశారు. మూవీ విడుదల రోజు నేను షూటింగ్ మానేస్తా అంటూ ట్వీట్ చేశారు. కాబట్టి డిసెంబర్ 25న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మత్తు వదలరా సినిమాకు వెళతారట. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో జరుపుకుంటుంది. ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ నందు చిత్రీకరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :