‘ఆర్ఆర్ఆర్’ ఉగాది ట్రీట్.. మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ లోగో !

Published on Mar 24, 2020 7:23 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో నేషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఉగాది సందర్భంగా మోషన్ పోస్టర్ తో కూడుకున్న టైటిల్ లోగోను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ మెంట్ పోస్టర్ లో తెలియజేశారు.

కాగా ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More