‘కల్కి’ ఉత్కంఠలో దాయాదుల క్రికెట్ పోరులా ఉంటుందట !

Published on Jun 10, 2019 9:20 am IST

“అ” అనే ఓ ప్రయోగాత్మక చిత్రానికి దర్శకత్వం వహించి ఇండస్ర్టీ లో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. కథ నచ్చడంతో నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని వాల్ పోస్టర్ అనే బ్యానర్ పై స్వయంగా నిర్మించారు. తన తదుపరి చిత్రంగా హీరో రాజశేఖర్ తో “కల్కి” అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు ఈ యంగ్ డైరెక్టర్. జూన్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్, నిర్మాత సి.కళ్యాణ్,జీవిత రాజశేఖర్ మీడియా తో ఈ మూవీ విశేషాలు పంచుకున్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘విభిన్నమైన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ప్రేక్షకుల్ని అలరిస్తుంది.సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నారు. ట్రైలర్ బాగుందని చాలా మంది స్వయంగా ఫోన్ చేసి చెప్పారన్నారు. రాజశేఖర్ గారి ఇమేజ్‌కి త‌గ్గ విధంగా, కొత్త తర‌హా సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి’ అని అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాను ‘ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ పోల్చారు. దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంట రేపుతుందో అంతే ఉత్కంఠను థియేటర్లలో ప్రేక్షకులకు ‘కల్కి’ మూవీ ఉత్కంఠ కలిగిస్తుంది’ అని ప్రశాంత్‌ వర్మ పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం :

More