ప్రభుత్వాన్ని కుదిపేసిన అంశం మీద రాజశేఖర్ సినిమా

Published on Nov 22, 2019 1:00 am IST

సీనియర్ హీరో రాజశేఖర్ తన తర్వాతి సినిమా కోసం సంచలన అంశాన్ని కథగా ఎంచుకున్నారట. ఇంతకీ ఆ అంశం ఏమిటా అనుకుంటున్నారా.. అదే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఫలితాలను వెల్లడించడంలో చేసిన పొరపాట్ల కారణంగా కొందరు విద్యార్థులు మనస్థాపానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ అంశం ప్రభుత్వాన్ని కుదిపేసింది.

ఇప్పుడు దాని మీదే సినిమా తీయాలని రాజశేఖర్ సిద్దమవుతున్నాడు. ఇందులో రాజశేఖర్ ప్రొఫెసర్, లాయర్ పాత్రలో నటిస్తాడట. ‘ఆంధ్రా పోరి` ఫేమ్ రాజ్ మదిరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందట. సొంత బ్యానర్ లోనే రాజశేఖర్- రాజ్ మాదిరాజ్ ద్వయం ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఇకపోతే రాజశేఖర్ ప్రస్తుతం ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More