రాజశేఖర్‌కు పోటీగా యువ హీరోలు

Published on Jun 11, 2019 7:36 pm IST

సీనియర్ హీరో రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కల్కి’. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూన్ 28వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే అంచనాలతో పాటు సినిమాకు పోటీ ఎక్కువగానే ఉంది. జూన్ 28న మరో రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒకటి ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్రకథ’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి కూడా పాజిటివ్ బజ్ ఉంది.

అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు చేసిన ‘బ్రోచేవారెవరురా’ కూడా జూన్ 28వ తేదీనే థియేటర్లలోకి రానుంది. కొద్దిసేపటి క్రితమే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. శ్రీవిష్ణుతో పాటు నివేత థామస్, నివేత పేతురాజ్, ప్రియదర్శి, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు కలిసి నటించిన ఈ సినిమా కూడా మొదటి నుండి భిన్నమైన రీతిలో ఆసక్తిని రేపుతోంది. మరి ఇద్దరు యువ హీరోలతో తలపడనున్న రాజశేఖర్ ఎలాంటి రిజల్ట్ రాబట్టుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More