రాజశేఖర్ “శేఖర్” మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Apr 16, 2022 7:01 pm IST

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శేఖర్”. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జోసెఫ్‌’కు ఇది రీమేక్‌. ఆత్మీయ రజన్, ముస్కాన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు మేకర్స్. మే 20వ తేదిన “శేఖర్” సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మల్లికార్జున నారగని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :