“రాజ్ దూత్” ట్రైలర్: క్రేజీ బైక్ ఆత్మకథ.

Published on Jun 8, 2019 1:02 pm IST

మేఘాంష్ శ్రీహరి నటించిన ‘రాజ్ దూత్’ మూవీ టీజర్ ని నిన్న విడుదల చేశారు. ఓ పాత షెడ్ లో ఉపయోగించకుండా పడిఉన్న రాజ్ దూత్ బైక్ హీరో కమ్ కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ తో తన కథ చెప్పుకుంటుంది. రాజ్ దూత్ బైక్ అంటే పడిచచ్చే హీరో ఆ బైక్ కోసం అందరి దగ్గరికి తిరుగుతుంటాడు. ఎట్టకేలకు ఆ బైక్ ను దక్కించుకున్న హీరో కి ఆ బైక్ వలన ఎదురయ్యే సమస్యలేంటి?… అనేది కథగా ఈ మూవీని తెరకెక్కించారు అని తెలుస్తుంది.

రాజ్ దూత్ బైక్ కి సునీల్ వాయిస్ ఓవర్ బాగుంది, గతంలో సునీల్ హీరో గా రాజమౌళి తెరకెక్కించిన “మర్యాద రామన్న” లో సైకిల్ కి రవి తేజా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదే ఫార్ములా ఈ మూవీలో దర్శకులు వాడినట్లున్నారు. చివర్లో హీరో చెప్పే “అమ్మాయిలకి ఢిల్లీ…,అబ్బాయిలకి పెళ్లి సేఫ్ కాదు” అనే డైలాగ్ బాగుంది. విలన్స్ తో పాటు చాలా మంది కమెడియన్స్ కనిపించడంతో వినోదం, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయనిపిస్తుంది.
అర్జున్-కార్తీక్ అనే దర్శకత్వ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీలో నక్షత్ర హీరోయిన్ గా నటిస్తుండగా, ఎం ఎల్ వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More