సరిలేరు నీకెవ్వరు కి సరిలేదు అంటున్న రాజేంద్ర ప్రసాద్

Published on Dec 10, 2019 11:03 am IST

సరిలేరు నీకెవ్వరు మూవీకి సరిలేదు అంటున్నారు సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్. అలాగే ఈసారి పెద్ద పండుగకు పండుగలాంటి సినిమాతో వస్తున్నాం అన్నారాయన. నిన్న ‘సూర్యుడవో… చంద్రుడివో’ పాట విదులైన సంధర్భంగా ఓ పాత్రికేయుడు రాజేంద్రప్రసాద్ ని సరిలేరు నీకెవ్వరు మూవీ గురించి అడుగగా ఆయన పై విధంగా స్పందించారు. విడుదలకు ముందే సినిమా గురించి ఎక్కువగా మాట్లాడే అలవాటులేదన్న ఆయన మహేష్ కెరీర్ లోనే అన్ని కమెర్షియల్ అంశాలు కలిగిన సినిమా సరిలేరు నీకెవ్వరు అన్నారు. అలాగే ఖచ్చితంగా ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అన్నారు. నేను సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పాను, సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటులు ఈ మూవీపై ఇంతటి విశ్వాసం వ్యక్తం చేయడం చూస్తుంటే మూవీ ఓరేంజ్ లో ఉంటుందనిపిస్తుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. మహేష్ ఈ మూవీలో అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మూవీ ప్రధానంగా రాయలసీమ నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. దేవిశ్రీ స్వరాలు అందిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 11న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :