ప్రభాస్ కోసం ఇంటి ముందు డాన్స్ చేసిన జపాన్ భామలు

Published on Jun 9, 2019 3:59 am IST

డార్లింగ్ ప్రభాస్ కి మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో, అంతకు మించిన ఫాల్లోవింగ్ అమ్మాయిల్లో ఉంది. ఈ ఆరడుగుల అందగాడంటే అమ్మాయిలకు యమా క్రేజ్. ఛత్రపతి,యోగి వంటి సినిమాలతో మాస్ హీరోగా ఎదిగిన ప్రభాస్, డార్లింగ్,మిర్చి మూవీ లతో అమ్మాయిల కలల రాకుమారుడయ్యాడు. .

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. జపాన్ లోవిడుదలైన బాహుబలి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకొని, ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచింది. ప్రభాస్ ని కలవడానికి వచ్చిన కొందరు జపాన్ అమ్మాయిలు ఆయన ఇంటి ముందు సందడి చేస్తూ, ఫొటో లకు పోజిచ్చారు. ఇప్పడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో ప్రభాస్ ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరు ఔరా అంటున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘సాహో’ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తయినదని సమాచారం.

సంబంధిత సమాచారం :

More