సూపర్ స్టార్ మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు

Published on Dec 15, 2019 9:00 am IST

సూపర్ స్టార్ రజిని తన లేటెస్ట్ మూవీ దర్బార్ ట్రైలర్ సిద్ధం చేశారు. తన అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ట్రైలర్ డేట్ అండ్ టైం ప్రకటించేశారు. ఈనెల 16 సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు దర్బార్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మరియు దర్శకుడు మురుగదాస్ సోషల్ మీడియా వేదికగా తెలియాజేశారు. ఈనెల 12న రజిని కాంత్ పుట్టిన రోజు కావడంతో ఆసంధర్భంగా ట్రైలర్ విడుదల ఉంటుందని అందరూ భావించారు. ఐతే ఆ రోజు ట్రైలర్ విడుదల జరుగలేదు.

ముంబై నేపథ్యంగా నడిచే మాఫియా స్టోరీనే దర్బార్ మూవీ అని తెలుస్తుంది. మాఫియాకు చుక్కలు చూపించే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో రజిని కాంత్ కనిపిస్తుండగా మూవీ ప్రధాన భాగం ముంబై లో చిత్రీకరించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజిని సరసన హీరోయిన్ గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా దర్బార్ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More