ఖుష్బూతో రజిని ఫ్యామిలీ సాంగ్ !

Published on Jan 25, 2021 7:30 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ – యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న రజిని 168వ సినిమా ఈ నెల 27 నుండి మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళబోతునట్లు తెలుస్తోంది. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే షూట్ లో రజిని పై ఓ సాంగ్ ను తీయబోతున్నారట. ఈ సాంగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వస్తోందట. అన్నట్టు ఈ సాంగ్ రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సాంగ్ అని తెలుస్తోంది. కాగా ఖుష్బూ ఈ సినిమా కోసం బరువు తగ్గి సరికొత్తగా రెడీ అయింది.

ఇక రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా నాకు కొత్తగా అనిపించింది. ఇక రజిని సర్ నాకు మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాయి’ అని ఆ మధ్య ఖుష్బూ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :